చిన్నారి కిడ్నాప్‌కు యత్నం.. గట్టిగా అరవటంతో కెనాల్‌లో పడేసి చంపిన దుండగుడు

byసూర్య | Tue, Feb 20, 2024, 09:54 PM

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఐదేళ్ల చిన్నారిని దండుగుడు పంట కాలువలో పడేసి చంపాడు. పాపను కిడ్నాప్ చేసేందుకు అతడు యత్నించగా.. చిన్నారి గట్టిగా అరవటంతో కాలువలో పడేసి చంపాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలానికి సర్కస్ చేస్తూ బతకడానికి వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారి ఆదివారం ఒంటరిగా రోడ్డుపై వెళ్తోంది.


 గమనించిన ఓ గుర్తు తెలియని దుండగులు పాప దగ్గరకు వెళ్లాడు. చిన్నారికి మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకున్నాడు. పాప భయంతో గట్టిగా అరవటంతో పక్కనే ఉన్న ఎస్సాఆర్‌ఎస్పీ పంట కాలువలో చిన్నారిని పడేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. చిన్నారి మృతదేహం రెడ్లవాడ వద్ద కాలువలో లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు.


సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాపను బైక్‌పై ఎక్కించుకున్న వ్యక్తి ఎవరు.. ఎందుకు పాపను చంపాల్సి వచ్చింది అనే కోణంలో విచారణ చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. కాగా.. చిన్నారి మృతితో సర్కస్ చేసుకుంటూ జీవనం సాగించే చిన్నారి కుటుంబంలో విషాదం అలుముకుంది.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM