ఏసీబీ వలకు చిక్కిన మరో అవినీతి తిమింగలం.. రూ.65 లక్షలు, రెండున్నర కిలోల గోల్డ్ సీజ్

byసూర్య | Tue, Feb 20, 2024, 09:45 PM

మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. వందల కోట్ల ఆస్తులు, భూములు అక్రమంగా కూడగట్టినందుకు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదిలా ఉండగానే.. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది.


బిల్లులు మంజూరు చేయడానికి లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ ఇంజినీర్‌ (ఎస్‌ఈ) జగజ్యోతి సోమవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. గంగన్న అనే కాంట్రాక్టర్‌ను నుంచి లంచం తీసుకుంటా పట్టుబడింది. గంగన్న గతంలో నిజామాబాద్‌లో పూర్తిచేసిన పనికి బిల్లు మంజూరవ్వగా.. హైదరాబాద్‌ శివార్లలోని గాజుల రామారంలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న జువైనల్‌ బాలుర వసతిగృహం కాంట్రాక్టునూ ఆయనే దక్కించుకున్నారు. నిజామాబాద్‌లో పూర్తయిన పనికి బిల్లులు మంజూరు చేయడం, గాజుల రామారం పనికి అంచనాలు సవరించేందుకుగాను ఎస్‌ఈ జగజ్యోతి లంచం డిమాండు చేశారు. దీంతో కాంట్రాక్టర్‌ గంగన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.


అతడి ఫిర్యాదు మేరకు పక్కా స్కెచ్ వేసిన ఏసీబీ అధికారులు.. మాసబ్‌ ట్యాంక్‌లోని కార్యాలయంలో రూ.84 వేలు లంచం తీసుకుంటున్న జగజ్యోతిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఆమె ఆఫీసులోనూ.. కొన్ని కీలకపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆమెను అరెస్టు చేసి ఏసీబీ కోర్డులో హాజరుపరిచారు.


Latest News
 

మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు Fri, Apr 12, 2024, 10:19 PM
ఏటీఎం దొంగ అరెస్ట్..! Fri, Apr 12, 2024, 07:01 PM
మరుగుదొడ్లకు హిందూ దేవతల పేర్లు Fri, Apr 12, 2024, 06:58 PM
ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు Fri, Apr 12, 2024, 06:55 PM
'ఇవి చేసినప్పుడే మా గ్రామానికి రావాలి' Fri, Apr 12, 2024, 06:53 PM