మీ ఊరి నుంచి మేడారం జాతరకు ఎలా వెళ్లాలి?.. పార్కింగ్ ప్లేస్‌లు ఎక్కడ?

byసూర్య | Tue, Feb 20, 2024, 07:59 PM

ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి మాహా జాతర ప్రారంభం కానుండగా.. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారి కోసం పోలీస్‌‌ శాఖ రూట్‌ మ్యాప్‌ను ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా మేడారం చేరుకునేందుకు ఈ రూట్ మ్యాప్‌ను వెల్లడించారు.


మేడారం వెళ్లేందుకు రూట్లు..


ఖమ్మం, మహబూబాబాద్ నుంచి వచ్చే వెహికిల్స్‌‌ నర్సంపేట మీదుగా ములుగు మండలం మల్లంపల్లి హైవే దగ్గర కలిసి.. ములుగు, పసర, నార్లాపూర్, మీదుగా మేడారం చేరుకోవాలి. హైదరాబాద్‌‌, నల్గొండ, కరీంనగర్‌‌, వరంగల్, హన్మకొండ మీదుగా వచ్చే వాహనాలు.. గుడెప్పాడ్‌‌ మీదుగా ములుగు దాటేసి పస్రా దగ్గర క్రాస్‌‌ తీసుకోవాలి. ఇక్కడి నుంచి నార్లాపూర్ మీదుగా మేడారం చేరుకోవాలి. ఈ రూట్లలో వచ్చే భక్తుల కోసం ఊరట్టం క్రాస్‌‌ నుంచి మొదలుకొని ప్రాజెక్ట్‌‌ నగర్‌‌ వరకు పార్కింగ్‌‌ ప్లేస్‌‌లు కేటాయించారు.


జాతర ముగిశాక తిరుగు ప్రయాణంలో వీళ్లు నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా భూపాలపల్లి, రేగొండ, పరకాల, గుడెప్పాడ్‌‌ క్రాస్‌‌ దగ్గర రైట్‌‌ తీసుకొని హైదరాబాద్‌‌, నల్గొండ, కరీంనగర్‌‌, వరంగల్, హన్మకొండ వాళ్లు వెళ్లిపోవాలి. ఖమ్మం, మహబూబాబాద్ వాళ్లు గుడెప్పాడ్‌‌ దగ్గర లెఫ్ట్‌‌ తీసుకొని మల్లంపల్లికి వచ్చి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలి.


చత్తీస్గఢ్, భద్రాచలం, మణుగూరు నుంచి వచ్చే వాహనాలు ఏటూరునాగారం, చిన్న బోయినపల్లి దగ్గర క్రాస్‌‌ చేసుకొని కొండాయి, ఉరట్టం మీదుగా మేడారం చేరుకోవాలి. వీళ్లకోసం ఊరట్టం దగ్గరలోనే పార్కింగ్‌‌ ప్లేస్‌‌లు కేటాయించారు. ఈ వాహనాలు అన్నీ తిరుగు ప్రయాణంలో వచ్చినదారిలోనే వెళ్లిపోవాలి.


గోదావరిఖని, మంచిర్యాల, పెద్దపెల్లి, మహారాష్ట్ర, కాళేశ్వరం నుంచి వచ్చే వాహనాలు.. కాటారం నుంచి క్రాస్‌‌ చేసుకొని చింతకాని, యామన్‌‌ పల్లి, పెగడపల్లి, సింగారం, కాల్వపల్లి మీదుగా ఊరట్టం చేరుకోవాలి. వీరికి ఊరట్టం దగ్గరే పార్కింగ్‌‌ ప్లేస్‌‌లు కేటాయించారు. ఈ వెహికిల్స్‌‌ అన్నీ కూడా తిరుగు ప్రయాణంలో ఇదే రూట్‌‌లో వెళ్లిపోవడానికి అనుమతించారు. అవసరమైతే నార్లాపూర్, బయ్యక్క పేట, గోళ్లబుద్ధారం, కమలాపురం క్రాస్ మీదుగా కూడా వెళ్లొచ్చునని అధికారులు తెలిపారు. ఆర్టీసీ బస్సులు, వీఐపీ, వీవీఐపీ వాహనాలు తాడ్వాయి దగ్గర క్రాస్‌‌ తీసుకొని మేడారం చేరుకోవాలి. తిరిగి ఇదే రూట్‌‌లో ఈ వాహనాలను పంపిస్తారు.


పార్కింగ్ స్థలాలు ఇవే..


ట్రాఫిక్ అంతరాయం లేకుండా నేటి నుంచి వన్‌‌ వే అమలు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ శబరీశ్‌‌ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ వరకు ఈ ట్రాఫిక్‌‌ రూల్స్‌‌ అమల్లో ఉంటాయని చెప్పారు. ఫిబ్రవరి 21 వ తేదీ నుంచి జరిగే మహాజాతరకు సుమారు నాలుగు లక్షలకు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగానే 1400 ఎకరాల్లో 33 పార్కింగ్‌‌ స్థలాలను ఏర్పాటు చేశారు. మేడారం చుట్టూరా 20 కిలోమీటర్ల పరిధిలో ఈ పార్కింగ్‌ స్థలాలు కేటా యించారు. పస్రా‒మేడారం రూట్‌‌లో జంపన్నవాగు దగ్గర నుంచి ప్రైవేట్‌‌ వెహికిల్స్‌‌ పార్క్‌‌ చేసుకోవచ్చు. ఆర్టీసీ బస్సులను తాడ్వాయి‒మేడారం రూట్‌‌లో బస్టాండ్‌‌ ప్లేస్‌‌లో పార్క్‌‌ చేయాలి. వీఐపీ, వీవీఐపీలకు గద్దెలకు దగ్గరలోనే పార్కింగ్‌‌ ప్లేస్‌‌లను కేటాయించారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM