అప్పుడే మొదలుపెట్టారా?.. హరీశ్ రావుకు మంత్రి సీతక్క కౌంటర్

byసూర్య | Sat, Dec 09, 2023, 09:12 PM

కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్లకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశం ముగిసిన తర్వాత.. మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన హరీశ్ రావు.. కాంగ్రెస్ సర్కారుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారం సమయంలో.. రైతులు వడ్లు అమ్ముకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ.500 బోనస్ ఇచ్చి మరీ కొంటామని హస్తం నేతలు చెప్పినట్టు హరీశ్ రావు గుర్తు చేశారు. మరోవైపు డిసెంబర్ 9 నుంచే రైతుబంధు డబ్బులు రూ.15 వేలు పంపిణీ చేస్తామని తెలిపినట్టు ప్రస్తావించారు. అయితే.. ఈ రెండు విషయాల్లో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని.. మాట తప్పిందని.. రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు. వీటిపై రేవంత్ సర్కారు వెంటనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.


అయితే... హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలన్నింటి ప్రభుత్వం అమలు చేస్తుందని సీతక్క స్పష్టం చేశారు. అధికారం చేపట్టి రెండు రోజులు కూడా కాకముందే.. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పందగా ఉందని సీతక్క తెలిపారు. ఒక్కొక్కటిగా అన్ని అమలు చేస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని.. మాట తప్పే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు సీతక్క. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అసలు బోనసే ఇవ్వలేదని.. సీతక్క తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో రైతులను తీవ్రంగా మోసం చేశారని ఆరోపించారు. క్వింటాల్‌ ధాన్యంలో సుమారు 10 కిలోలు తీసేసి.. రైతులను చాలా ఇబ్బంది పెట్టారని గుర్తుచేశారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని చెప్పి చేయలేదన్నారు. రైతుబంధు ద్వారా వందల ఎకరాలు ఉన్న భూస్వాములే లబ్ది పొందారని సీతక్క పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు వేల కోట్లు అప్పులు చేసి.. పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని దర్జాగా బతికారంటూ ఆరోపించారు. ఇప్పుడేమమో.. పెద్ద పెద్ద ఫాంహౌస్‌ల ఓనర్లు, మాజీ మంత్రులు.. రైతుబంధు రాలేదని బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతు బంధుపై సీఎం రేవంత్ రెడ్డి.. సమీక్షించిన తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తామని సీతక్క స్పష్టం చేశారు.


Latest News
 

వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM
హైదరాబాద్‌వాసులు, ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. ఆ రూట్‌లో అందుబాటులోకి ఎంఎంటీఎస్ Fri, Mar 01, 2024, 09:17 PM