కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది,,,, యశోద ఆసుపత్రి వైద్యుల హెల్త్ బులిటెన్

byసూర్య | Sat, Dec 09, 2023, 09:18 PM

కాలుజారిపడటం వల్ల యశోద ఆసుపత్రి వైద్యుల హెల్త్ బులిటెన్ కేసీఆర్ యశోద ఆసుపత్రి లో చేరిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే కేసీఆర్ హెల్త్ బులెటిన్‌ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయనకు నిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం ఆయన హెల్త్ బులిటిన్‌ను వైద్యులు విడుదల చేస్తున్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో వాకర్‌తో నడుస్తున్నారు. శనివారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు రెండో రోజు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనను వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నాడని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరఫీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజంతా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు. 



Latest News
 

వరద బాధితుల కోసం CM సహాయనిధికి ప్రముఖుల విరాళాలు Mon, Sep 16, 2024, 03:59 PM
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి Mon, Sep 16, 2024, 03:55 PM
హైదరాబాద్‌లోని హోటల్‌లో నర్సింగ్‌ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది Mon, Sep 16, 2024, 03:15 PM
మిష‌న్ల‌తో గాల్లోకి రోడ్ల‌పై రంగుల కాగితాలు ఎగరేయ‌డం చేయొద్ద‌న్న జీహెచ్ఎంసీ Mon, Sep 16, 2024, 03:04 PM
తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చిరంజీవి రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు Mon, Sep 16, 2024, 02:58 PM