తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు,,,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్వీట్

byసూర్య | Sat, Dec 09, 2023, 09:04 PM

"తెలంగాణ మహాలక్ష్ములకు అభినందనలు" అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సోనియమ్మ ఇచ్చిన మాట ప్రకారం మేం చెప్పిన కార్యాచరణ మొదలైంది... తెలంగాణ ఆడబిడ్డ మోములలో ఆనందం చూడడమే ఇందిరమ్మ పాలన లక్ష్యమని పేర్కొన్నారు. అందులో భాగంగానే నేడు ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినట్లు చెప్పారు. తెలంగాణలో సంక్షేమానికి ఇది తొలి అడుగు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సందర్భంలోని ఫోటోలను ట్వీట్ చేశారు. సీఎం రేవంత్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీలు ఆ ఫొటోల్లో ఉన్నారు.Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM