మ‌రికాసేప‌ట్లో మ‌హాల‌క్ష్మీ ప‌థ‌కం ప్రారంభం

byసూర్య | Sat, Dec 09, 2023, 12:56 PM

తెలంగాణ రాష్ట్రంలోని బాలికలు, మహిళలు, ట్రాన్స్‌ జెండర్ల‌కు TSRTC బ‌స్సుల్లో ఉచిత ప్రయాణం క‌ల్పించేందుకు ఉద్దేశించిన మహాలక్ష్మి పథ‌కం మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానుంది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో క‌లిసి సీఎం రేవంత్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం క‌ల్పించింది.
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. కొత్తగా ఎమ్మ‌ల్యేగా ఎన్నికైన స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ నేటి నుంచి రాష్ట్ర మహిళలకు టిఎస్ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం1. 30గంటలకు అసెంబ్లీ వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రోలో ఉచితంగా ప్రయాణించవచ్చు. వారంపాటు ఎలాంటి ఐడి కార్డు లేకుండా జర్నీ చేయవచ్చు. ఆ తర్వాత ఆధార్ చూపించి ప్రయాణించాలి. అనంతరం అర్హులందరికీ మహాలక్ష్మీ స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు.


Latest News
 

నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ Fri, Sep 20, 2024, 01:31 PM
ప్రయాణిస్తున్న కారులో అగ్నిప్రమాదం Fri, Sep 20, 2024, 01:29 PM
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ ఆస్పత్రులను మరణాల ఉచ్చుగా మార్చింది : కేటీఆర్ Fri, Sep 20, 2024, 12:34 PM
పండగ సాయన్న స్పూర్తి తో ముందుకు వెళ్దాం : నీలం మధు Fri, Sep 20, 2024, 12:27 PM
మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. Fri, Sep 20, 2024, 12:25 PM