గుడ్‌న్యూస్‌.. ఆరోగ్యశ్రీపై కీలక నిర్ణయం

byసూర్య | Sat, Dec 09, 2023, 12:44 PM

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును రూ.10 లక్షలకు పెంచుతూ కీల‌క నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ నిర్ణ‌యం అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని వెల్ల‌డించింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. కాగా, ఇది వరకు రూ.5 ల‌క్ష‌ల వరకు ఆరోగ్యశ్రీ కింద కవరేజ్ ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు.
ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీలో కొత్తగా నియమితులైన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం అక్బరుద్దీన్‌ అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు శాఖలు కేటాయించారు.


Latest News
 

రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM