రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు

byసూర్య | Fri, Sep 20, 2024, 10:48 AM

 రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు. నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమైన నేపథ్యంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం కీలక సూచన చేసింది. తెలంగాణ వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.ఈనెల 21న మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు.


అదేవిధంగా ఈనెల 22న ఉమ్మడి మహబూబాబ్‌నగర్‌, మెదక్, వికారాబాద్, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. 23న హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా వర్షం కారణంగా పిడుగులు పడే అవకాశం ఉండటంతో వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లే వారు చెట్ల కింద నిలబడకూడదని సూచించారు. ఇక విద్యుత్ సరఫరాకు సంబంధించి ఎలాంటి వస్తువులను తడి చేతులతో తాకరదని అధికారులు కీలక సూచనలు చేశారు.


Latest News
 

రానున్న మూడు రోజుల పాటు తెలికపాటి నుంచి మోస్తారు వర్షాలు Fri, Sep 20, 2024, 10:48 AM
నిమజ్జన వేడుకల్లో యువకులపై దాడి Fri, Sep 20, 2024, 10:45 AM
ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక పురోగతి Fri, Sep 20, 2024, 10:19 AM
వాటర్ హీటర్ షాక్ తో వ్యక్తి మృతి... Thu, Sep 19, 2024, 09:48 PM
వరద బాధితుల సహాయార్థం నెల జీతాన్ని విరాళంగా ఇచ్చిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు Thu, Sep 19, 2024, 08:49 PM