byసూర్య | Sat, Dec 09, 2023, 11:34 AM
మల్లాపూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి, సుల్తాన్ పూర్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ అనే యువకుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి వేణుగోపాల్ ఆమెను లోబర్చుకున్నాడు. పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి ముఖం చాటేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని రిమాండ్ కు తరలించారు.