byసూర్య | Sat, Dec 09, 2023, 10:04 AM
కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండల కేంద్రంలో శనివారం ఉదయం గ్రామ సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గ్రామ పంచాయతీలకు ప్రతి ఒక్కరు సహకరించి ఆరోగ్యకరమైన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. శ్రీశైలం ప్రధాన రహదారిపై వేసిన వ్యర్థాలను తొలగించాలని ఆదేశించారు.