byసూర్య | Fri, Dec 08, 2023, 11:03 PM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం ఉదయం రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. రేపు ఉదయం ఏడున్నర గంటలకు బీజేపీ కార్యాలయంలో వారితో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజాసింగ్ చెబుతున్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే మిగతా ఏడుగురు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సైతం తీసుకొనున్న కిషన్ రెడ్డి విధాన పరమైన నిర్ణయం తీసుకోనున్నారు.