ఎంపీ పదవికి రాజీనామా చేసిన సీఎం రేవంత్ రెడ్డి

byసూర్య | Fri, Dec 08, 2023, 10:36 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. లోక్ సభ సభాపతి ఓం బిర్లాతో రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. సభాపతితో సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవహారాల మాజీ ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ కూడా ఉన్నారు. సభాపతికి రాజీనామాను సమర్పించిన అనంతరం రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ బయలుదేరుతున్నారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. రేవంత్ రెడ్డి నిన్న ముఖ్యమంత్రిగా ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్‌లో శాఖల కేటాయింపు, మరో ఆరుగురు కేబినెట్ ఎంపికపై చర్చించేందుకు రేవంత్ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లారు.



Latest News
 

గంజాయిని ఎలా తరలించారో చూస్తే.. Mon, Dec 02, 2024, 02:09 PM
మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో పిటిషన్ Mon, Dec 02, 2024, 02:02 PM
నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే Mon, Dec 02, 2024, 01:04 PM
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి Mon, Dec 02, 2024, 01:01 PM
ఏడాది పాలనలో ఏం చేశారని విజయోత్సవాలు : డీకే అరుణ Mon, Dec 02, 2024, 12:26 PM