కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స విజయవంతం,,,,పరామర్శించిన జానారెడ్డి

byసూర్య | Fri, Dec 08, 2023, 10:32 PM

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని, ఆయనను గదికి మార్చామని, బీఆర్ఎస్ అధినేత కోలుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని ప్రముఖ జర్నలిస్ట్ సుధాకర్ ఉండుముల ట్వీట్ చేశారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్‌ను మరో గదికి మారుస్తున్న 22 సెకండ్ల వీడియోను పోస్ట్ చేశారు. కేసీఆర్‌కు శస్త్రచికిత్స విజయవంతమైనట్లు యశోద ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. ఎనిమిది వారాల్లో ఆయన కోలుకుంటారని తెలిపారు. ఇదిలావుంచితే, కేసీఆర్‌‌ను కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జానారెడ్డి తన భార్య, తనయుడు, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ వెంకట్ రెడ్డితో కలిసి పరామర్శించారు. శుక్రవారం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.


Latest News
 

మరో వివాదంలో ఇరుక్కున్న మంత్రి కొండా సురేఖ.. ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే Mon, Oct 14, 2024, 12:04 AM
11 రోజుల్లోనే ఇన్ని వందల కోట్ల మద్యం తాగేశారా Sun, Oct 13, 2024, 10:40 PM
రంగంలోకి కేసీఆర్, ఈసారి పక్కా వ్యూహంతో.. ముహూర్తం ఫిక్స్ Sun, Oct 13, 2024, 10:36 PM
ఏపీ సీఎం చంద్రబాబుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం Sun, Oct 13, 2024, 10:29 PM
మేయర్ గద్వాల విజయలక్ష్మిపై కేసు నమోదు Sun, Oct 13, 2024, 10:26 PM