byసూర్య | Fri, Dec 08, 2023, 10:29 PM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడో శాసనసభ కొలువుదీరనుంది. ఈ క్రమంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. ఆ తర్వాత.. ఎమ్మెల్యేలంతా కలిసి.. స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఓవైసీ వ్వవహించడాన్ని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఎంతగా అంటే.. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే.. బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశానికి హాజరుకామని రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఈమేరకు రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు.
అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే.. నేను ప్రమాణం చేయను. నేనే కాదు.. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరూ శనివారం రోజు అసెంబ్లీలో ప్రమాణం చేయరు. అక్బరుద్దీన్‌కు ప్రొటెం స్పీకర్‌గా ఎందుకు అవకాశం ఇచ్చారు. ఆయన కంటే అసెంబ్లీలో ఎందరో సీనియర్లు ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇలాగే చేసింది. రేపటి అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరిస్తోంది. అంటూ రాజాసింగ్ వీడియోలో చెప్పుకొచ్చారు. సాధారణంగా అయితే.. ప్రొటెం స్పీకర్‌గా ఎమ్మెల్యేగా ఎక్కువ సార్లు ఎన్నికైన వారిని ఎన్నుకుంటారు. లెక్కప్రకారం చూస్తే.. ప్రొటెం స్పీకర్‌గా బీఆర్ఎస్ అధినేత కేసీఆరే.. అందరికంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ లాజిక్ ప్రకారం.. కేసీఆరే ప్రొటెం స్పీకర్ కావాలి. అయితే.. కేసీఆర్ కాలికి అనుకోకుండా కాలికి గాయం కావటం.. సర్జరీ చేయటం.. జరిగాయి. ఈ సర్జరీ తర్వాత కేసీఆర్ 6 నుంచి 8 వారాల పాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో.. కేసీఆర్ రేపు జరగనున్న సమావేశాలు రాలేకపోతుండటంతో.. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్‌గా ఎన్నుకున్నట్టుగా తెలుస్తోంది.