రేవంత్ రెడ్డికి తిలకం దిద్దిన దీపేందర్ సింగ్ తల్లి

byసూర్య | Wed, Dec 06, 2023, 11:08 PM

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా తల్లికి పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు.  రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో పలువురు నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా దీపేందర్ సింగ్ హుడా నివాసానికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. ఈ సమయంలో హుడా తల్లి... రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించి దీపేంద్ర సింగ్ హుడా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత తన ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి ఈ రోజు తన నివాసానికి చేరుకొని తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని పేర్కొన్నారు. నిజమైన స్వేహితుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చారని, సీఎం అవుతున్నప్పటికీ గతంలో కంటే ఆత్మీయత కనిపిస్తోందని పేర్కొన్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుపుతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM