దుర్గం చెరువులో వేలాది చేపల మృత్యువాత,,,,ఆందోళన చెందుతున్న పలువురు నెటిజన్లు

byసూర్య | Wed, Dec 06, 2023, 09:31 PM

హైదరాబాద్‌లో పర్యాటక ప్రాంతమైన దుర్గం చెరువులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. వేలాదిగా చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతున్నాయి. మరికొన్ని చేపలు ఆక్సిజన్ ఆందక నీటిపైకి వచ్చి ఊపిరి పీల్చుకుంటున్నాయి. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేపల మృత్యువాతపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. చెరువులోని నీటిని పరీక్షించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ అధికారులను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్‌లో పోస్టులు పెడుతున్నారు.


కారణం అదేనా..?


దుర్గం చెరువు ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నట్లు మహీంద్ర యూనివర్సిటీ అండ్ ఐఐటీహెచ్ టీమ్ గతంలోనే తెలిపింది. ఈ చెరువు ఇప్పుడు వ్యర్థాలు, కాలుష్యంతో నిండిపోయినట్లు స్టడీ చేసింది. దుర్గంలో చెరువులో వివిధ కంపెనీల నుంచి వస్తున్న కెమికల్స్ కలవడంతో నీరు డేంజర్‌గా మారిందని పేర్కొన్నారు. చెరువు నీటిలో ఇప్పటికే ఆక్సిజన్ శాతం భారీగా తగ్గిపోయింది. చేపలు, కప్పలు, ఇతర జలచరాలు దుర్గం చెరువులో బతుకలేకపోతున్నాయి. చెరువు నీటిలో యాంటి డిప్రెసెంట్స్, పెయిన్కిల్లర్స్, యాంటి ఒబెసిటీ మెడిసిన్స్, వెయిట్ లాస్ తగ్గించే మెడిసిన్‌తో పాటు కొకైన్ వంటి విషపూరిత పదార్థాలు ఉన్నట్లు వారు చేసిన స్టడీలో తేలింది.


చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించి టెస్ట్ చేయగా అందులో 183 రకాల సేంద్రియ సూక్ష్మ కాలుష్య కారకాలు ఉన్నట్లు గుర్తించారు. ఫార్మాస్యూటికల్స్, హెర్బిసైడ్లు, శిలీంద్ర సంహరిణులు, పురుగు మందులు, యూవీ ఫిల్టర్లు, స్టాస్టిసైజర్లు, సైనోటాక్సిన్లు, హార్మోన్లు, స్టెరాయిడ్లు, మెటాబోలైట్లు లాంటివి ఉన్నట్లు తేల్చారు. 50శాతం ఫార్మాస్యూటికల్స్, 9 శాతం మెటాబోలైట్లు, 8 శాతం హెర్బిసైడ్లు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇవి నీటిలోని జీవులకు ప్రమాదరమని.. వాటి వల్లే చేలలు చనిపోతున్నట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.


Latest News
 

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో బస చేయనున్నా ప్రధాని మోదీ Mon, Mar 04, 2024, 10:49 PM
జగన్‌కు భారీ ఓటమి.. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే కష్టం: పీకే సంచలన కామెంట్లు Mon, Mar 04, 2024, 08:52 PM
క్రికెట్‌ ఆడుతూ హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. ఎంత విషాదం..! Mon, Mar 04, 2024, 08:46 PM
తండ్రిపై ప్రేమ.. రూ. 3 కోట్ల విలువైన భూమి విరాళం Mon, Mar 04, 2024, 08:39 PM
యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పట్నుంచంటే..? Mon, Mar 04, 2024, 08:01 PM