కొత్త ఎమ్మెల్యేలకు క్లాస్లులు,,,,సభలో వ్యవహరించాల్సిన తీరుపై పాఠాలు,,,,రాజ్యాంగపరమైన అంశాలపై వివరణ

byసూర్య | Wed, Dec 06, 2023, 09:18 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 64 స్థానాలు దక్కించుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. తెలంగాణ కొత్త సీఎంగా కొడంగల్ ఎమ్మెల్యే, టీసీసీసీ రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అదిష్టనం ఫైనల్ చేసింది. డిసెంబర్ 7న ఆయన ఎల్పీ స్టేడియంలో సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. కాగా, ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. తొలిసారిగా వారు సభలో అధ్యక్షా.. అని అనబోతున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాలపై కొత్త ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ చిన్నారెడ్డి, ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌లు పాఠాలు బోధించారు. మంగళవారం (డిసెంబర్ 5న) వారిద్దరూ ఎమ్మెల్యేలు బసచేసిన ఎల్లా హోటల్‌కు చేరుకొని శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు, రాజ్యాంగపరమైన అంశాలను కొత్త ఎమ్మెల్యేలకు వివరించారు. తమకు శాసనసభలో ఎలా వ్యవహరించాలనే అంశంతో పాటు, రాజ్యాంగపరమైన అనేక విషయాలను వివరించారని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నేతగా ఉన్న మేడిపల్లి సత్యం (ప్రస్తుతం చొప్పదండి ఎమ్మెల్యే) తెలిపారు. రేవంత్‌రెడ్డి కూడా సోమవారం ఉదయం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ ఇదే హోటల్‌లో ఎమ్మెల్యేలతో కలసి ఉన్నారు. పలు అంశాలపై చర్చించారు.


Latest News
 

హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో బస చేయనున్నా ప్రధాని మోదీ Mon, Mar 04, 2024, 10:49 PM
జగన్‌కు భారీ ఓటమి.. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికే కష్టం: పీకే సంచలన కామెంట్లు Mon, Mar 04, 2024, 08:52 PM
క్రికెట్‌ ఆడుతూ హార్ట్ ఎటాక్‌తో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి.. ఎంత విషాదం..! Mon, Mar 04, 2024, 08:46 PM
తండ్రిపై ప్రేమ.. రూ. 3 కోట్ల విలువైన భూమి విరాళం Mon, Mar 04, 2024, 08:39 PM
యాదాద్రీశుడి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఎప్పట్నుంచంటే..? Mon, Mar 04, 2024, 08:01 PM