రేవంత్‌తో పాటు ఆరుగురు మంత్రుల ప్ర‌మాణం?

byసూర్య | Wed, Dec 06, 2023, 03:32 PM

తెలంగాణ సీఎంగా రేవంత్ గురువారం ప్ర‌మాణం చేయనుండ‌గా.. మంత్రివ‌ర్గ కూర్పుపై క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. మంత్రివ‌ర్గ కూర్పుపై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నాయ‌క‌త్వంతో రేవంత్ చ‌ర్చలు జ‌రుపుతున్నారు. రేవంత్‌తో పాటు ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. స్పీక‌ర్ ఎవ‌ర‌నేది తేలిన త‌ర్వ‌త మ‌రోసారి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.
కాంగ్రెస్ నేత‌లు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల‌తో రేవంత్ రెడ్డి స‌మావేశం ముగిసింది. వారిరువురినీ రేపు ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌బోయే ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి రేవంత్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ.. రేవంత్ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమల‌వుతాయ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్ర‌జా స‌ర్కార్‌ను ఏర్పాటు చేస్తుంద‌ని రాసుకొచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రేపు ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌మాణ స్వీకారం అనంతరం ఆయ‌న దేనిపై తొలి సంత‌కం చేయనున్నారని ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకాలు చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌థ‌కాల అమ‌లుకు దాదాపు రూ.88 వేల కోట్లు అవసరం అవుతాయ‌ని అంచ‌నా. సీఎం హోదాలో రేవంత్ ఏ వర్గానికి శుభవార్త చెప్పనున్నారో? రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.


Latest News
 

యాదాద్రిలో స్టీల్ లింక్ బ్రిడ్జి.. దేశంలోనే రెండో అతి పెద్దది Fri, Sep 20, 2024, 10:17 PM
వడ్లకు రూ.500 బోనస్, హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలు Fri, Sep 20, 2024, 10:14 PM
90 ఏళ్ల వృద్ధురాలిపై ముగ్గురు యువకుల అత్యాచారం..! Fri, Sep 20, 2024, 10:12 PM
భజన పేరుతో.. మిరప తోటలోనే యవ్వారం పెట్టేశాడు Fri, Sep 20, 2024, 10:00 PM
తెలంగాణలో మరో జూపార్క్ ,,,ఫోర్త్ సిటీలో ఏర్పాటు Fri, Sep 20, 2024, 09:56 PM