డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై ఫోకస్

byసూర్య | Wed, Dec 06, 2023, 02:38 PM

నగరంలో పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లపై అధికారులు ఫోకస్ చేశారు. 4వ విడత సమయానికి కోడ్ అమల్లోకి వచ్చిందని ర్యాండమైజేషన్ ప్రక్రియ నిలిపివేశారు. కోడ్ ముగిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నా తరుణంలో ఇప్పటివరకు ఇచ్చినవి ఎన్ని. ఇంకా ఇవ్వల్సినవి ఎన్ని. సదుపాయాలు ఎలా ఉన్నాయని రెవెన్యూ జీహెచ్ఎంసీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో రెండు రోజుల్లో డబుల్ బెడ్ రూమ్ డిగ్నిటీ హౌసింగ్ సొసైటీలకు వెళ్లి ఇన్ఫెక్షన్ చేయనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు HYDలోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి ఇప్ప‌టికే కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. అలాగే మాజీ ముఖ్య‌మంత్రులు కేసీఆర్‌, చంద్ర‌బాబు స‌హా తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపనున్నారు. కేసీఆర్ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రిగా సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి రేపు ప్ర‌మాణం చేయనున్నారు. ప్ర‌మాణ స్వీకారం అనంతరం ఆయ‌న దేనిపై తొలి సంత‌కం చేయనున్నారని ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలపై సంతకాలు చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప‌థ‌కాల అమ‌లుకు దాదాపు రూ.88 వేల కోట్లు అవసరం అవుతాయ‌ని అంచ‌నా. సీఎం హోదాలో రేవంత్ ఏ వర్గానికి శుభవార్త చెప్పనున్నారో? రేప‌టి వ‌ర‌కు వేచి చూడాలి.


Latest News
 

పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఎల్‌పీజీ గ్యాస్‌ పథకం Sat, Sep 21, 2024, 03:02 PM
ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sat, Sep 21, 2024, 03:00 PM
పలు అంగన్వాడి సెంటర్లలో పోషణ మాసోత్సవవాలు Sat, Sep 21, 2024, 02:58 PM
గ్రామపంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం Sat, Sep 21, 2024, 02:41 PM
ఘనంగా పీఎం విశ్వకర్మ మొదటి వార్షికోత్సవ వేడుక Sat, Sep 21, 2024, 02:37 PM