తుఫానుపై అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు

byసూర్య | Tue, Dec 05, 2023, 08:13 PM

మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. తెలంగాణలో పలు జిల్లాల్లో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచిస్తూ ట్వీట్ చేశారు. వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూసుకోవాలని ఆదేశించారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు అభిమానులు, కార్యకర్తలు స్పందిస్తున్నారు. ‘సీఎం ఆన్ డ్యూటీ’, ‘కంగ్రాట్స్ సీఎం సాబ్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. తెలంగాణ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి అధికారిక ప్రకటన రాక ముందే రేవంత్ రెడ్డి ఈ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో అభిమానులు అభినందనలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Latest News
 

మత్స్యకారుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే Fri, Oct 04, 2024, 02:32 PM
ఫ్యామిలీ హెల్త్ కార్డుల్లో వివరాలు పక్కాగా నమోదు చేయాలి Fri, Oct 04, 2024, 02:17 PM
మాదాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ Fri, Oct 04, 2024, 02:14 PM
గొలుసు కట్టు వ్యాపారాలతో ప్రజలను మోసం మోసం చేస్తే చర్యలు Fri, Oct 04, 2024, 02:00 PM
నవరాత్రుల పూజలో సతీసమేతంగా పాల్గొన్న నీలం మధు Fri, Oct 04, 2024, 01:45 PM