సోషల్ మీడియాలో ట్రోలింగ్‌పై వేణుస్వామి స్పందన.. ఆ వ్యాఖ్యలకు వీడియోతో క్లారిటీ..!

byసూర్య | Tue, Dec 05, 2023, 08:16 PM

తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విషయంలో జ్యోతిష్కుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో కేసీఆర్ కాదు.. కేటీఆర్ సీఎం అవుతారని.. ఒకవేళ తాను చెప్పింది నిజం కాకపోతే జ్యోతిష్యమే మానేస్తానంటూ వేణుస్వామి చెప్పిన వీడియోను.. ఫలితాల సమయంలో పెద్ద ఎత్తున వైరల్ చేశారు నెటిజన్లు. అయితే.. ఫలితాల్లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బీఆర్ఎస్ ఓడిపోయింది. కాంగ్రెస్‌కు ఫుల్ మెజార్టీ వచ్చింది. ఇవాళో రేపో ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయబోతోంది. అయితే.. సినిమా రంగ ప్రముఖులు, రాజకీయ ప్రముఖుల విషయాల్లో వేణుస్వామి చెప్పిన ప్రిడిక్షన్ చాలా వరకు నిజం కాగా.. ఈ ఎన్నికల విషయంలో మాత్రం గురి తప్పిందని.. జ్యోతిష్యం ఎప్పుడు వదిలేస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఆయనపై రకరకాల మీమ్స్‌ కూడా వైరల్ అవుతున్నాయి.


కాగా... ఈ ట్రోలింగ్‌పై స్పందించిన వేణుస్వామి.. నెటిజన్లకు ఓ క్లారిటీ ఇచ్చారు. "సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తూ నేను చెప్పినట్టుగా చెబుతున్న వీడియో ఇది... ఒరిజినల్ వీడియో.. యాంకర్ తెలంగాణలో టీఆర్ఎస్ వస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న ప్రశ్నకు నేనిచ్చిన సమాధానాన్ని కట్ చేసి ఆ వీడియోను ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్న ట్రోలర్స్ అందరికీ నా శుభాకాంక్షలు నా మంగళాకాంక్షలు." అంటూ తన అఫీషియల్ అకౌంట్లలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు ఒరిజినల్ వీడియోను కూడా వేణు స్వామి జత చేశారు.


"తెలంగాణలో కేసీఆర్‌కు ఆల్టర్నేటివ్ లేదని.. కానీ 2023లో కేసీఆర్ గారి పార్టీ టీఆర్ఎస్ గెలిస్తే.. రాసిపెట్టుకోండి కాబోయే సీఎం కేటీఆర్. డైరెక్టు సీఎం. కేసీఆర్ సీఎం కారు. డైరెక్టు కేటీఆరే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలిస్తేనే. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే.. అప్పుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డా, రాజ్ గోపాల్ రెడ్డా లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడా అన్నది అప్పుడు చూద్దాం. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. కిషన్ రెడ్డి అవుతాడా, బండి సంజయ్ అవుతాడా, డీకే అరుణ అవుతుందా అనేది అప్పుడు చూద్దాం." అంటూ తాను చెప్పిన ప్రిడిక్షన్‌ వీడియోను వేణు స్వామి పంచుకున్నారు. దీంతో.. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు వేణుస్వామి చెక్ పెట్టారు. మరి ఈ వీడియోపై నెటిజన్లు ఎలా స్పందిస్తారో చూడాలి.


Latest News
 

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. 'నిమిషం నిబంధన' నుంచి ఉపశమనం Fri, Mar 01, 2024, 10:25 PM
వెలుగులోకి మరో స్కాం.. పిల్లలకు పంచే పాల స్కీంలో మహిళా అధికారి చేతివాటం Fri, Mar 01, 2024, 09:36 PM
నేటి నుంచి ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్.. తాహసీల్దార్, ఆర్డీవోలకు అధికారాలు Fri, Mar 01, 2024, 09:32 PM
బీఆర్‌ఎస్‌ ‘మేడిగడ్డ’కు కౌంటర్.. ఛలో పాలమూరుకు కాంగ్రెస్ పిలుపు Fri, Mar 01, 2024, 09:26 PM
తెలంగాణ రైతులకు శుభవార్త.. కేంద్ర పథకంలో చేరిన రేవంత్ సర్కార్ Fri, Mar 01, 2024, 09:21 PM