రావణ రాజ్యం ఎంజాయ్ చేయండి....తెలుగు సినీనటి సంచలన పోస్ట్

byసూర్య | Tue, Dec 05, 2023, 07:20 PM

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంపై తెలుగు సినీనటి మాధవీలత సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్లలో జరగబోయే దారుణాలు ఇవే అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. తెలంగాణలో వచ్చే ఐదేళ్ల తర్వాత 1 ఫుడ్ ఉండదు 2 ఉద్యోగాలు ఉండవు 3 మహిళలకు రక్షణ ఉండదు 4 హిందువుల పండగలు ఉండవు 5 శాంతి ఉండదు అని పోస్టు చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే.. తాను బీఆర్ఎస్‌కు 99 మార్కులు వేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీది రావణ రాజ్యమని 'ఎంజాయ్ గుడ్ లక్ కాంగ్రెస్ లవర్స్' అంటూ ఆమె పోస్టు పెట్టారు.


ఇక బీజేపీ తెలంగాణలో బాగు పుంజుకుందని చెప్పారు. 2018లో ఆ పార్టీకి ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 8కి చేరిందన్నారు. మరో 19 స్థానాల్లో ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. బీజేకి ఓటు బ్యాంకు పెరిగిందని.. కాషాయ పార్టీపై నమ్మకం కూడా పెరిగిందని చెప్పారు. తెలంగాణలో ఇది బీజేపీకి బూస్ట్ ఇచ్చే అంశమని అన్నారు. మాధవీలత రాసుకొచ్చిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె కామెంట్లను కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు.


 కెరీర్ మొదట్లో మాధవీలత స్నేహితుడా, నచ్చవులే, అరవింద్ 2 వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టాలీవుడ్‌లో మహిళలపై జరుగుతున్న వేధింపులు, అవకాశాల పేరుతో లోబరుచుకునే ప్రయత్నాలు లాంటివి జరుగుతాయని సంచలనం కామెంట్స్ చేసింది. తనపై ఎన్ని వివాదాలు జరిగినా, ఎంత ట్రోలింగ్ ఎదురైనా మాధవీలత ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సినిమా అవకాశాలు తగ్గాక.. ఆమె పాలిటిక్స్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. బీజేపీలో పార్టీలో చేరారు. గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సోషల్ మీడియాలో ఏదో ఒక అంశంపై ఇలా సంచనల పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తున్నారు.Latest News
 

భర్తలపై పెరిగిపోతున్న భార్యల దాడులు.. తెలంగాణలోనే ఎక్కువ Mon, Feb 26, 2024, 07:18 PM
హైదరాబాద్‌ ప్రజలకు మరో శుభవార్త.. ట్రాఫిక్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం.. సర్కార్ గ్రీన్ సిగ్నల్ Mon, Feb 26, 2024, 07:13 PM
వెలుగులోకి మరో భారీ కుంభకోణం.. రైతుబంధు, రైతుబీమా పేర్లతో కోట్లు కాజేసిన అధికారి Mon, Feb 26, 2024, 07:10 PM
ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మార్చి 31 వరకు అవకాశం..! Mon, Feb 26, 2024, 07:06 PM
కచ్చితంగా ఎంపీగా పోటీ చేస్తా.. అప్పుడు కూడా నాకు అన్యాయమే జరిగింది: వీహెచ్ Mon, Feb 26, 2024, 07:02 PM