హైదరాబాద్‌లో ఒంటె మాంసం విక్రయం...ముగ్గురు నిందితులు అరెస్ట్

byసూర్య | Tue, Dec 05, 2023, 07:17 PM

డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు వ్యక్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పక్కడో ప్రాణానికి ఏమైతేనేం.. మనకు పైసలే ముఖ్యమని బరితెగిస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లొ ఒంటెం మాసం అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టోలిచౌకి పరిధి హకీంపేట పారామౌంట్ కాలనీకి చెందిన మహ్మద్ ఇస్మాయిల్, మహ్మద్ సల్మాన్, సిరాజ్ ఖాన్ మాంసం అమ్మే వ్యాపారం చేస్తున్నారు. మూడు నెలల క్రితం 7 ఒంటెలను నగరానికి తీసుకువచ్చి వాటిని చంపి ఆ మాంసాన్ని విక్రయిస్తున్నారు. స్థానికంగా ఉండే దుకాణాల్లో మాంసాన్ని అమ్ముతున్నారు. ఒంటె మాంసం విక్రయంపై సమాచారం అందుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. పారామౌంట్ కాలనీ ఏరియాలో దాడులు నిర్వహించారు. అక్రమంగా ఒంటె మాంసం అమ్ముతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. మాసంకొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కల్తీకి ఆస్కారం ఉందని..తెలిసిన దుకాణాల్లోనే మటన్ వంటి మాంసాన్ని కొనాలని అంటున్నారు. సర్టిఫైడ్, లైసెన్స్‌లు ఉన్న దుకాణాల్లోనే మటన్ కొనాలని చెబుతున్నారు. అనవసరంగా అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


Latest News
 

అనాజీపూర్ లో 17వ శతాబ్దపు వీరగల్లులు Tue, Jan 21, 2025, 09:59 PM
బీసీలకు 60 శాతం రాజకీయ వాట దక్కాల్సిందే? Tue, Jan 21, 2025, 09:57 PM
ఎస్జీటీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి Tue, Jan 21, 2025, 09:55 PM
కాంగ్రెస్ నాయకులు గ్రామ సభలు విజయవంతమయ్యేలా చూడాలి Tue, Jan 21, 2025, 09:52 PM
రాహుల్ గాంధీ పీఏనంటూ కూడా మభ్యపెట్టిన బుర్హానుద్దీన్ Tue, Jan 21, 2025, 09:31 PM