మళ్లీ పెరుగుతున్న ఉల్లి ధరలు

byసూర్య | Tue, Dec 05, 2023, 11:46 AM

రాష్ట్రంలో ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో ఉల్లిని కోయకుండానే సామాన్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దసరా, దీపావళి సమయంలో కిలో ఉల్లి ధర రూ.30. నెల రోజుల క్రితం కూడా కిలో ఉల్లి రూ.70 నుంచి రూ.80కి పెరిగింది. కేంద్ర ప్రభుత్వ చర్యలు, రైతులు నిల్వ ఉంచిన ఉల్లిని మార్కెట్ కు తీసుకురావడంతో ఉల్లి ధర కాస్త తగ్గింది. కిలో రూ. 40 నుంచి రూ.50 తగ్గింది.
ఇప్పుడు ఉల్లి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లి రూ. 80 పలుకుతోంది. గతంలో టమాటా ధరపై ఆందోళన పడిన ప్రజలు ఇప్పుడు ఉల్లి ధరపై ఆందోళన చెందుతున్నారు. సోమవారం మెదక్ మార్కెట్‌లో పది కేజీల బస్తా కొనుగోలు చేస్తే రూ.800 అంటే కిలో రూ.80... విడిగా కొనుగోలు చేస్తే రూ. కిలో 90 చొప్పున విక్రయిస్తున్నారు. ఉల్లి ధర భారీగా పెరగడంతో మిర్చి బండి వద్ద ఉల్లి అమ్ముడుపోవడం లేదు.


Latest News
 

పిడుగుపాటుతో పాడి గేదలు మృతి Sun, Sep 22, 2024, 11:57 AM
ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు Sun, Sep 22, 2024, 11:53 AM
పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి Sun, Sep 22, 2024, 11:51 AM
రైతు వేదిక బాగుంది.. నిర్వహణే భారమైంది ! Sun, Sep 22, 2024, 11:49 AM
గర్భిణీ మహిళలకు సంపూర్ణ వైద్య సేవలను సమర్థవంతంగా అందించాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sun, Sep 22, 2024, 11:48 AM