పండ్ల మొక్కలు పెంచండి అదిగ లాభాలు పొందండి

byసూర్య | Sun, Sep 22, 2024, 11:51 AM

ఆత్మకూర్: ఈ రోజు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస రావు ఆత్మకూరు మండలం కామారం గ్రామపంచాయతీలో పాల్గొనడం జరిగింది. స్వచ్ఛతా హి సేవలో  ఈరోజు నిర్వహించే క్లోరినేషన్ కార్యక్రమం అలాగే గ్రామంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపాధి హామీ లో ఈ సంవత్సరం చేపట్టిన మునగ, మామిడి  మొక్కలు పెంచుతున్న తీరును పొలాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతులకు పలు సూచనలను చేయడం జరిగింది. అందరు రైతులు కూడా పండ్ల మొక్కల పెంపకం పై దృష్టి పెట్టాలని దీని వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. తదుపరి మొక్కలు నాటి గ్రామంలో ఉన్న నర్సరీ  ఇతర ప్లాంటేషన్ లను సందర్శించి సంతృప్తి వ్యక్తం  చేశారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లా అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి  శ్రీనివాసరావు  ప్లాంటేషన్ మేనేజర్  శ్రీనివాస రెడ్డి ఏపీవో రాజిరెడ్డి, ఈసీ లు శ్రీధర్, రాము, కామారం పంచాయతీ కార్యదర్శి లావణ్య, టి ఏ శ్రీధర్, ఎఫ్ఎ సుధాకర్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM
ఈనెల 28న లోక్ అదాలత్ విజయవంతం చేయాలి Sun, Sep 22, 2024, 01:07 PM