పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్

byసూర్య | Sun, Sep 22, 2024, 01:09 PM

దేవరకొండ పట్టణ కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ  డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో వివేకానంద ఒకేషనల్ జూనియర్ కళాశాలలో సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి గర్ల్స్ కమిటీ వేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి  కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 వేల కోట్ల పైగా స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉందన్నారు.
స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులకు టిసి,మెమో, కండక్ట్లు తీసుకునే సమయంలో కళాశాల యజమాన్యం నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారన్నారని,అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దగ్గరికి వస్తున్న కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి విద్య శాఖ మంత్రి లేకపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యశాఖ మంత్రిని నియమించాలని,ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ అట్టడుగు విద్యార్థులకు   రాష్ట్ర ప్రభుత్వం అండగానిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు  దేవరకొండ డివిజన్ అధ్యక్షులు రమావత్ లక్ష్మణ్ నాయక్, ఇద్దిరాములు,రాకేష్, చరణ్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM