ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం

byసూర్య | Sun, Sep 22, 2024, 01:10 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వ్యారంటీలు అమలు పరిచే దిశగా ముందుకు సాగుతుందని కుత్బుల్లాపూర్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కొలను హన్మంతు రెడ్డి అన్నారు. అనంతరం అభయ హస్తం 6 గారెంటీలల్లో భాగంగా 500 కి ఎల్పిజి సిలిండర్ మహాలక్ష్మి పథకం శనివారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి గ్రామ పరిధిలోని తెలంగాణ ప్రభుత్వ సరఫరా చౌక ధరల దుకాణములో మహాలక్ష్మి పథక లబ్దిదారులకు 5౦౦రూ. కి ఎల్పిజి పత్రాన్ని కొలన్ హన్మంత్ రెడ్డి అందజేశారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కి , డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కి , పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ధన్యవాదాలు తెలియజేసారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పేదల కోసం మరిన్ని పథకాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తుందని తెలిపారు. ఈ  కార్యక్రమంలో ఎన్ఎంసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు  సీతారామ్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, శంకర్, అశోక్, యాదయ్య, జితేందర్ రెడ్డి  మరియు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

నల్ల చెరువులో 14 ఎకరాల మేర కబ్జా జరిగినట్లు గుర్తింపు Sun, Sep 22, 2024, 02:33 PM
అన్ని శాఖల సమన్వయంతో గంజాయి నిర్మూలనకు కృషి Sun, Sep 22, 2024, 01:16 PM
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి Sun, Sep 22, 2024, 01:13 PM
ఆరు గ్యారంటీలు అమలు కాంగ్రస్ తోనే సాధ్యం Sun, Sep 22, 2024, 01:10 PM
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని ఎస్ ఎఫ్ ఐ డిమాండ్ Sun, Sep 22, 2024, 01:09 PM