తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు

byసూర్య | Tue, Dec 05, 2023, 11:39 AM

తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లోని మియాపూర్‌, కూకట్‌పల్లి, మూసాపేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట, ఖైరతాబాద్‌, నాంపల్లి, దిల్‌ సుఖ్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, హయత్‌నగర్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డుపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, అశ్వారావుపేట, నేలకొండపల్లి, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, కల్లూరు, ఆళ్లపల్లి, సత్తుపల్లిలో వర్షం కురుస్తోంది. ఇల్లెందు సమీపంలోని సింగరేణి ప్రాంతంలోని ఉపరితల గనిలో వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల గంటకు 90 కి.మీ కంటే ఎక్కువ వేగంతో గాలులు వీస్తున్నాయి. దీంతో పలుచోట్ల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మిగ్జామ్ తుపాను గంటకు 7 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతోంది.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM