సీల్డ్ కవర్ లో సీఎం పేరు...?

byసూర్య | Tue, Dec 05, 2023, 11:34 AM

తెలంగాణలో సీఎం ఎవరు అవుతారనే ఉత్కంఠకు ఇవాళ తెరపడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రాజధాని ఢిల్లీ వెళ్లిన డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీలో సీఎం క్యాండిడేట్ ని ఎంపిక చేస్తారు. అనంతరం డీకే, ఠాక్రే సీల్డ్ కవర్ తో సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుంటారు. అందులో ఎవరి పేరు ఉంటుందో వారే తెలంగాణ సీఎం కానున్నారు.
తెలంగాణ సీఎం అభ్యర్థిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుండగా.. ఈ విషయంపై ఏఐసీసీ AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. 'సాయంత్రంలోపు సీఎం అభ్యర్థిని ఫైనల్ చేస్తాం. ఇవాళే సీఎం పేరును ప్రకటిస్తాం' అని వెల్లడించారు. కాసేపటి క్రితం ఢిల్లీ చేరుకున్న పార్టీ సీనియర్ నేతలు ఉత్తమ్, భట్టి.. మధ్యాహ్నం ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ భేటీ తర్వాత సీఎం అభ్యర్థిపై క్లారిటీ రానుంది.


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM