తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్

byసూర్య | Mon, Dec 04, 2023, 11:04 PM

ఎన్నికల ఫలితాలు వెలువడటంతో తెలంగాణలో ఎన్నికల కోడ్ ముగిసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దాదాపు రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో, బీఆర్ఎస్ 39 నియోజకవర్గాల్లో, బీజేపీ 8 సీట్లు, మజ్లిస్ 7 సీట్లు, సీపీఐ 1 స్థానంలో గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి ఎంపిక రేపటికి వాయిదాపడింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నలుగురు పరిశీకులు అధిష్ఠానంతో చర్చించేందుకు ఢిల్లీకి బయలుదేరారు.



Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM