కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం..... ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచన

byసూర్య | Mon, Dec 04, 2023, 11:04 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లో ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెల 16వ తేదీ వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ ప్రజల తీర్పు నేపథ్యంలో హుందాగా తప్పుకున్నట్లు చెప్పారు. కొత్త ప్రభుత్వానికి మనం సహకరిద్దామని... ఏం జరుగుతుందో చూద్దామన్నారు. త్వరలో తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందని, ఫలితాలపై సమీక్ష ఉంటుందని వెల్లడించారు. త్వరలో పార్టీ శాసన సభా పక్ష నేతను ఎన్నుకుందామన్నారు.Latest News
 

శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి.. వారం రోజుల్లో మరో 2 పథకాలు ప్రారంభం Wed, Feb 21, 2024, 11:14 PM
సిద్దిపేట పవర్ హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం.. అంధకారంలో పట్టణం Wed, Feb 21, 2024, 11:13 PM
కిడ్నాపర్లు అనుకొని పోలీసులను చితకబాదారు.. ఎస్‌ఐకి తీవ్ర గాయాలు Wed, Feb 21, 2024, 09:32 PM
టికెట్ల కోసం బస్సులో కండక్టర్ ఫీట్లు.. ఈయన కష్టం చూస్తే నవ్వాపుకోలేరు Wed, Feb 21, 2024, 09:31 PM
రూ.500కే గ్యాస్ సిలిండర్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక అప్డేట్ Wed, Feb 21, 2024, 09:29 PM