byసూర్య | Sun, Dec 03, 2023, 10:09 AM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ 57 స్థానాల్లో ముందంజలో ఉండగా.. BRS 37 స్థానాలు, BJP 8 స్థానాలు, MIM, ఇతరులు చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. ఎల్బీనగర్ BRS అభ్యర్థి సుధీర్‌రెడ్డి, కొడంగల్, కామారెడ్డిలో రేవంత్ రెడ్డి(కాంగ్రెస్), హుజూరాబాద్‌లో BRS అభ్యర్థి కౌశిక్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
హైదరాబాద్ లో ఎక్కువ స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ లీడింగ్ లో ఉంది. రాష్ట్రంలో పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ లీడ్ సాధించింది. ఫలితాలపై అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. గజ్వేల్ నియోజకవర్గంలో BRS అభ్యర్థి, సీఎం కేసీఆర్ తొలి రౌండ్ ముగిసేసరికి 8,827 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మేడ్చల్: మల్లారెడ్డి (భారాస) లీడ్. ఇల్లెందు: కనకయ్య (కాంగ్రెస్) ఆధిక్యం. నారాయణఖేడ్: సంజీవ్‌రెడ్డి (కాంగ్రెస్) ఆధిక్యం. అచ్చంపేట: వంశీకృష్ణ (కాంగ్రెస్) లీడ్.