రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీ భద్రత

byసూర్య | Sun, Dec 03, 2023, 10:02 AM

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆ పార్టీ అభ్యర్థులు తొలి రౌండ్ ఫలితాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం 65 స్థానాల్లో కాంగ్రెస్, 39 స్థానాల్లో బీఆర్ఎస్, బీజేపీ 5 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి. కొండగల్, కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అధిక్యం కనబర్చడంతో రేవంత్ ఇంటివద్దకు భారీగా అభిమానులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్‌ తొలి రౌండ్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేసీఆర్‌ ముందంజలో ఉన్నారు. పాలకుర్తిలో ఎర్రబెల్లి వెనుకంజలో ఉన్నారు. హుస్నాబాద్‌లో పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. సత్తుపల్లిలో సండ్ర వెంకట వీరయ్య (బీఆర్‌ఎస్) ముందంజలో ఉన్నారు.


Latest News
 

తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM
మూసీకి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానన్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 09:00 PM
పోడు భూముల విషయంపై స్పందించిన మంత్రి సీతక్క Thu, Oct 17, 2024, 07:46 PM
ఈ నెల 23వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం Thu, Oct 17, 2024, 07:44 PM