కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తం.. ఆ అభ్యర్థులపై స్పెషల్ ఫోకస్

byసూర్య | Sat, Dec 02, 2023, 09:36 PM

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. రేపు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ జరగనున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. కాంగ్రెస్ వైపే మొగ్గు చూపగా.. ఆ పార్టీ అధిష్ఠానం పూర్తి ధీమాతో ఉంది. దీంతో.. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధిష్ఠానం నేతలకు సూచించింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ ఉంటుందన్న సర్వే ఫలితాలతో.. ఒక్క అభ్యర్థి కూడా చేజారకుండా ఉండేందుకు.. హస్తం పార్టీ నాయకత్వం అప్రమత్తమైంది. ఎవరూ ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. తెలంగాణకు చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థులందరినీ హైదరాబాద్‌ రప్పించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం.


కాంగ్రెస్‌కు పూర్తి మెజార్టీ రాని పక్షంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై ఆ పార్టీ నాయకత్వం ఇప్పటికే ప్లాన్లు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని డీకే శివకుమార్ ఆరోపించారు. కేసీఆరే స్వయంగా తన పార్టీ అభ్యర్థులను సంప్రదించినట్లు ఆయన ఆక్షేపించారు. అయితే.. క్యాంపు రాజకీయాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించిందన్న ఆరోపణలపై స్పందించిన డీకే శివకుమార్.. ఆ అవసరం రాకపోవచ్చని.. అభిప్రాయపడ్డారు. అయితే.. మెజార్టీ రాకపోతే మాత్రం తమకు మద్దతిచ్చే నేతలను క్యాంపులకు తరలించే అవకాశం ఉందని శ్రేణులు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 49 కౌంటింగ్‌ కేంద్రాల్లో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో.. అన్ని కేంద్రాల వద్ద ప్రత్యేక పరిశీలకులను నియమించింది ఏఐసీసీ. ఏమాత్రం అనుమానం వచ్చినా.. నాయకత్వం దృష్టికి తీసుకురావాలని సూచించినట్టు సమాచారం. అటూ ఇటూగా ఉన్న అభ్యర్థులపై, బీఆర్ఎస్‌ పార్టీతో సంబంధాలున్న నేతలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించినట్టు తెలుస్తోంది.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM