గజ్వేల్ ఫలితం వచ్చేది అప్పుడేనా...?

byసూర్య | Sat, Dec 02, 2023, 02:17 PM

తెలంగాణలో గజ్వేల్ ఫలితం రాత్రి 8 గంటల తర్వాత వస్తుందని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. 23 రౌండ్లలో కౌంటింగ్ కొనసాగుతుందన్నారు. 44 మంది అభ్యర్దులు ఉన్నందున కౌంటింగ్ ఆలస్యం అవుతుందని, పూర్తి ఫలితం రాత్రి 8 తర్వాత వెలువడుతుందని కలెక్టర్ తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

మెట్రో రాకతో డిమాండ్.. హైదరాబాద్‌లో ఆ ప్రాంతంపైనే అందరి చూపు Sun, Oct 20, 2024, 11:34 PM
హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్కి ప్రమాదం Sun, Oct 20, 2024, 11:31 PM
ఎండు గంజాయి రవాణా చేస్తున్న వాహనం పట్టివేత Sun, Oct 20, 2024, 11:23 PM
శ్రీ ధరణి వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై నిశ్శబ్ద ర్యాలీ Sun, Oct 20, 2024, 11:20 PM
శ్రీహరికోట ను సందర్శించేందుకు కోదాడ వాసి ఎన్నిక Sun, Oct 20, 2024, 11:18 PM