ఎన్నిక‌ల కౌంటింగ్‌.. డీజీపీ కీలక సూచనలు

byసూర్య | Sat, Dec 02, 2023, 01:00 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి రేపు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. లెక్కింపు కేంద్రాల వెలుపల, లోప‌ల పటిష్ఠ నిఘా పెట్టాలని చెప్పారు. చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

బుగ్గార మండలం గ్రామాల్లో పలువురిని పరామర్శించిన MLA విప్ Mon, Oct 21, 2024, 04:36 PM
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. Mon, Oct 21, 2024, 04:32 PM
బుగ్గారం ఎక్స్ రోడ్ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించిన BRS నాయకులు Mon, Oct 21, 2024, 04:30 PM
పిఈటి జిల్లా టాపర్ అంకం శేఖర్ కు ఘనసన్మానం Mon, Oct 21, 2024, 04:24 PM
ప్రజలను మోసం చేయడమేనా కాంగ్రెస్ ప్రజా పాలన Mon, Oct 21, 2024, 04:22 PM