రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్ కు ఏర్పాట్లు

byసూర్య | Sat, Dec 02, 2023, 12:41 PM

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కౌంటింగ్‌కు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.40 సెంట్రల్ కంపెనీ దళాలు మూడు పొరల భద్రతతో స్ట్రాంగ్ రూమ్‌లను కాపాడుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదటి అరగంట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం తెలిపింది. 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 49 ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలోని 13 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో మూడంచెల భద్రతను ఏర్పాటు చేసింది. స్ట్రాంగ్‌రూమ్‌ల లోపల, బయట కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు. స్ట్రాంగ్ రూంలోకి వెళ్లేందుకు ఓకే ఎంట్రీ, ఎగ్జిట్ ఉండేలా ఏర్పాట్లు చేయడంతోపాటు స్ట్రాంగ్ రూంకు డబుల్ లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తెలంగాణ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గానికి 14+1 చొప్పున టేబుల్స్ ఏర్పాటు చేస్తారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కోసం ఎక్కువ టేబుల్స్ ఉన్నాయి. కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, పటాన్‌చెరు ఈ నాలుగు నియోజకవర్గాల్లో 400లకు పైగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో ఆయా నియోజకవర్గాల్లో 20+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు. రాజేంద్రనగర్, ఎల్బీనగర్, సేరిలింగంపల్లి, మహేశ్వరం, మేడ్చల్ నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఇక్కడ 28+1 టేబుళ్లను ఏర్పాటు చేశారు.


నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల లో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ ప్రారంభించారు. కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో 144సెక్షన్ విధించారు. 6 నియోజకవర్గాల కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. సాయుధ బలగాలతో పహారా కాస్తున్నారు. సీసీ కెమెరా ల ద్వారా అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 1549 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. 74.68 శాతం పోలింగ్ నమోదైంది. 6 సెగ్మెంట్లలో 77 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎమ్ లలో నిక్షిప్తం ఉంది. అర్బన్ లో అత్యధికంగా 21మంది పోటీలో ఉన్నారు. ఇంటి నుంచి ఓటు వేసిన వృద్దులు వికలాంగులు 2248, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 7215, అత్యవసర సర్వీస్ లో ఉన్న ఉద్యోగులు 50 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. 2352 బ్యాలెట్ యూనిట్లు,1957 కంట్రోల్ యూనిట్లు, 2186 వీవి ఫ్యాట్ లు ఉన్నాయి.


ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఐదు చోట్ల జరుగుతుంది హన్మకొండ. వరంగల్ జిల్లాల సంబంధించి వరంగల్ ఈస్ట్ వర్ధన్నపేట నర్సంపేట.. వరంగల్ వెస్ట్ పరకాల సంబంధించిన ఐదు నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ ఎనమాముల వ్యవసాయ మార్కెట్లో చేపడుతున్నారు.. జనగామ జిల్లా పరిధిలోని పాలకుర్తి జనగామ స్టేషన్గన్పూర్ ఈ మూడు నియోజకవర్గాల కౌంటింగ్ ని జిల్లా కేంద్రంలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ కి ఏర్పట్లు పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గంల కౌంటింగ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో జరగనుంది ఇక భూపాలపల్లి నియోజకవర్గం కౌంటింగ్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలోని సింగరేణి మినీ హాల్లో చేపడుతున్నారు ములుగు నియోజకవర్గం కౌంటింగ్. ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నారు.


Latest News
 

ఆలయ మాడవీధుల్లో భార్య, కూతురుతో కలిసి కౌశిక్ రెడ్డి రీల్స్ Mon, Oct 21, 2024, 08:41 PM
గ్రూప్ 1 విద్యార్థులు కోరితే తాము కోర్టులో కేసు వేశామన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:26 PM
విద్యుత్ బిల్లుల పేరుతో భారం మోపే అవకాశముందన్న కేటీఆర్ Mon, Oct 21, 2024, 08:24 PM
బీరప్ప కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Mon, Oct 21, 2024, 08:18 PM
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు Mon, Oct 21, 2024, 08:08 PM