సీఈవో తో రేవంత్ బృందం భేటీ

byసూర్య | Sat, Dec 02, 2023, 11:38 AM

రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ నేత‌ల బృందం కాసేప‌ట్లో.. తెలంగాణ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌(సీఈవో) వికాస్‌ రాజ్‌ను క‌ల‌వ‌నుంది. ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువడే స‌మ‌యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్‌ నిఘా పెట్టాలని సీఈవో ద‌గ్గ‌ర ప్రస్తావించనుంది. రైతు బంధు నిధులు మ‌ళ్లింపు అంశంతో పాటు HYD చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌ భూముల్ని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే అంశంపై ఫిర్యాదు చేయ‌నుంది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. 


Latest News
 

రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వచ్చిన గ్లోబల్ స్టార్ Tue, Oct 22, 2024, 08:13 PM
సుప్రీం ఆదేశాలను అమలు చేయాలని వినతి Tue, Oct 22, 2024, 07:50 PM
జీహెచ్ఎంసీ కమిషనర్ ను కలిసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:49 PM
చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే Tue, Oct 22, 2024, 07:47 PM
పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కుమారుడు,,తర్వాత సహజ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం Tue, Oct 22, 2024, 07:37 PM