కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలి: భట్టి

byసూర్య | Sat, Dec 02, 2023, 11:31 AM

కాంగ్రెస్ పార్టీ పై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి భారీగా ఓట్లు వేసిన ప్రజలకు సహకరించిన మీడియాకు అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈసారి 1.80 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు 8. 30 గంటల నుంచి జరుగుతుంది. అప్పటికి పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తికాకపోతే సమాంతరంగా రెండు కౌంటింగ్ ప్రక్రియలు నిర్వహిస్తారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM