హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా.

byసూర్య | Tue, Oct 22, 2024, 09:57 PM

సాధారణంగా హాస్పిటల్‌కు కొందరు అనారోగ్యంతో వస్తారు. లేదా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రోగులను చూసేందుకు మరికొందరు వస్తుంటారు. ఇక ఎలాగూ.. డాక్టర్లు, వైద్య సిబ్బంది, సాధారణ సిబ్బంది రావటం కామన్. అయితే.. వీళ్లంతా కాకుండా ఇంకో వర్గం వాళ్లు కూడా వస్తుంటారు. వాళ్లంతా కక్కుర్తిగాళ్లు ఇంకెవ్వరూ ఉండరు. ఎంతో బాధతో ఆస్పత్రికి వచ్చే వాళ్ల దగ్గరి నుంచి దొంగతనం చేసేందుకు వస్తుంటారు దరిద్రులు. అలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా పరిగిలో చోటుచేసుకుంది.


పరిగి మండలం గడిసింగాపూర్‌కు చెందిన అజయ్ అనే వ్యక్తి.. ఈ నెల 18న విజేత ఆస్పత్రికి బైకుపై వచ్చాడు. ఆస్పత్రి బయట తన ద్విచక్రవాహనాన్ని పార్కు చేసి లోపలికి వెళ్లాడు. తొందరగానే వస్తాననుకున్నాడో.. ఆస్పత్రి దగ్గర దొంగలెవరు ఉంటారని అనుకున్నాడో కానీ.. బైకును అంత జాగ్రత్తగా పార్క్ చేయకుండా లోపలికి వెళ్లిపోయాడు. మరి.. ఎప్పటి నుంచి కాచుకుని కూర్చున్నాడో తెలియదు కానీ.. అజయ్ తన బైకును పార్క్ చేసి లోపలికి వెళ్లాడో లేదో.. మెరుపు తీగలా వచ్చి బైకును స్టార్ట్ చేసుకుని అదే మెరుపు వేగంతో మాయమైపోయారు. అజయ్ బయటికి వచ్చి చూస్తే.. అక్కడ బైక్ కన్పించకపోవటంతో.. అక్కడున్న వారిని అడగ్గా ఓ వ్యక్తి తీసుకెళ్లాడని చెప్పారు. దీంతో.. తన బైకు చోరీకి గురైందని నిర్ణయించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


అయితే.. బైకును దొంగిలించిన దొంగ మాత్రం ఎంచక్కా దాని నెంబర్ మార్చేసి.. దర్జాగా రోడ్లపై తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే.. బైకును పోలిన బైకులు చాలానే రోడ్ల మీద కనిపించినా.. తమ బైకుకు మాత్రం దాని యజమాని ఇట్టే గుర్తుపడతాడు. అచ్చం అలాగే.. తన బైకు అజయ్ కూడా గుర్తుపట్టాడు. ఏమాత్రం భయం లేకుండా దొంగ యథేచ్చగా బైక్ మీద తిరుగుతున్న క్రమంలో.. అజయ్‌కు కంట పడ్డాడు. అయితే.. నెంబర్ వేరేగా ఉన్నప్పటికీ.. అది తన బైకే అని గుర్తించాడు. దీంతో.. బైకును ఆపాలని అడ్డం తిరగటంతో.. అనుమానం వచ్చిన దొంగ.. ఆపకుండా వెళ్లిపోయాడు. దీంతో.. అజయ్ ఆ దొంగను మరో బైకు మీద ఛేజ్ చేశాడు.


 దొంగ.. గడిసింగాపూర్‌ వైపు వెళ్తుండం గమనించిన అజయ్.. ఆ గ్రామంలో ఉంటున్న తన బంధువులకు ఆ దొంగ గురించి సమాచారం ఇచ్చాడు. దీంతో.. అక్కడ రెడీగా ఉన్న అజయ్ బంధువులు.. బైకును అడ్డగించి దొంగను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎందుకు తన బైక్ దొంగిలించావని అడిగితే.. అర్జెంట్ పని ఉంటే తీసుకెళ్లానంటూ తాపీ సమాధానం చెప్పటం గమనార్హం. దీంతో.. కోపోద్రిక్తులైన యువకులు.. ఆ దొంగను స్తంభానికి కట్టేసి.. తనివి తీరా దేహశుద్ది చేశారు. ఇలాంటి దొంగతనాలు మరోసారి చేయకుండా ఉండాలంటే.. ఆ ఇదిలా ఉంటే.. ఇటీవ కాలంలో ఆస్పత్రుల్లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. వాళ్లు ఉన్నది ఆస్పత్రి అన్నది కూడా మర్చిపోయి.. అక్కడ కూడా వారి దొంగ బుద్ధి చూపిస్తున్నారు. అప్పటికే బాధలో ఉన్న బాధితులను.. వీరి కక్కుర్తితో మరింత బాధపెడుతున్నారు.


Latest News
 

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ Tue, Oct 22, 2024, 10:09 PM
సీఎం కాన్వాయ్‌ వెళ్లేదారిలో ఇకపై అలాంటివి ఉండవు.. రేవంత్ కీలక ఆదేశాలు Tue, Oct 22, 2024, 10:03 PM
హాస్పిటల్‌కు వచ్చి ఇదేం పని బ్రో.. కొంచెమైనా బుద్దుండక్కర్లే.. మరీ అక్కడ కూడానా. Tue, Oct 22, 2024, 09:57 PM
'కేటీఆర్.. మీ ఇద్దరివి ఆ వీడియోలు బయటపెట్టమంటావా..? తల ఎక్కడ పెట్టుకుంటావ్ Tue, Oct 22, 2024, 09:52 PM
తెలంగాణలో కొత్త అసెంబ్లీ భవనం.. నిజాం రాజసం ఉట్టిపడేలా.. మంత్రి కీలక ప్రకటన Tue, Oct 22, 2024, 09:49 PM