చెరువులోకి దూసుకెళ్లిన ఎన్నికల అబ్జర్వర్ టీం వాహనం

byసూర్య | Fri, Dec 01, 2023, 07:58 PM

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కేసరి సముద్రం చెరువు మినీ ట్యాంక్ బండ్‌లోకి ఎన్నికల అధికారుల వాహనం దూసుకెళ్లింది. ప్రమాదవశాత్తు చెరువులోకి తుఫాను వాహనం దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో వాహనంలో డ్రైవర్ తప్ప అధికారులు ఎవరూ లేరు. డ్రైవర్ చాకచక్యంగా బయటపడి ప్రాణాలు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్ల గ్రామానికి చెందిన మధు అనే వ్యక్తి తుఫాన్ వాహనం తీసుకొని నడిపిస్తున్నాడు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావటంతో గత నెల రోజులుగా ఎన్నికల అధికారుల కోసం అద్దెకు నడుపుతున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ వెళ్తుండగా.. ఇవాళ ఉదయం ఎండబెట్ల వద్ద ఉన్న బ్రిడ్జిపై నుండి అదుపుతప్పి వాహనం చెరువులోకి దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో ఎన్నికల అధికారులెవరూ అందులో లేరు. గత రాత్రే వారిని జిల్లా కేంద్రంలో విడిచిపెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. ఇక్కడ తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.. అధికారులు బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడం వల్లే ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.


Latest News
 

గోల్డ్ ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు Sat, Oct 26, 2024, 01:51 PM
బెటాలియన్ కానిస్టేబుల్స్ ఆందోళన Sat, Oct 26, 2024, 01:02 PM
పార్టీ ఫిరాయింపులపై మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు Sat, Oct 26, 2024, 12:51 PM
కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM