కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..!

byసూర్య | Sat, Oct 26, 2024, 11:42 AM

హైదరాబాద్ నగరంలో ఆన్ లైన్ వ్యభిచారం తీవ్ర కలకలం రేపింది. ఏకంగా మెట్రో స్టేషన్స్ ను అడ్డాగా చేసుకుని చీకటి దందాలకు తెరలేపింది ఓ ముఠా. మెట్రో స్టేషన్ల వద్ద రకరకాల వ్యాపారాలు సాగుతున్నాయి.కానీ, పలు మెట్రో స్టేషన్ల వద్ద బహిరంగంగానే వ్యభిచారం సాగిస్తుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మెట్రో స్టేషన్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారడంతో ప్రయాణికులతో పాటు, నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో కూకట్ పల్లి, కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్స్ వద్ద ప్యాసింజర్స్ రద్దీ ఓ రేంజ్ లో ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని చీకటి బాగోతాలకు తెరలేపారు కొందరు వ్యక్తులు. బహిరంగంగానే వ్యభిచారం నిర్వహిస్తూ మెట్రో స్టేషన్స్ వద్ద న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు


వ్యభిచార ముఠాల ఆగడాలతో విసుగెత్తిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయా మెట్రో స్టేషన్ల వద్ద తనిఖీలు నిర్వహించారు. దీంతో వ్యభిచార ముఠా గుట్టు రట్టైంది. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న 38 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో మహిళలు, యువతులే కాకుండా ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివవారల్లోకి వెళ్తే.. గతకొంతకాలంగా కూకట్ పల్లి, కేపిహెచ్బీ మెట్రో స్టేషన్ల వద్ద బహిరంగ వ్యభిచారానికి తెరలేపారు. స్టేషన్ వద్దకు వచ్చిపోయే వారిని నిలువరించి బేరాలాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంతేకాదు బేరాలు కుదరకపోయే సరికి వాళ్లలో వాళ్లే గొడవలు పడుతున్నారు. దీంతో ఆ మెట్రో స్టేషన్ల వద్ద ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.ఈ క్రమంలో వ్యభిచార దందాపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కూకట్ పల్లి సర్కిల్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మెట్రో స్టేషన్ల కింద పలువురు మహిళలు న్యూసెన్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు, ఎస్వోటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న 38 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సోషల్ మీడియాలో కూకట్ పల్లి గర్ల్స్ పేరుతో ఆన్ లైన్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు వెల్లడించారు.


 


యువకులను రెచ్చగొట్టేలా రీల్స్ చేస్తూ వ్యభిచారానికి తెరలేపుతున్నారని పోలీసులు తెలిపారు. వ్యభిచార దందాకు పాల్పడుతున్న వారిని పోలీసులు బైండోవర్ చేశారు. పట్టుబడిన వారిలో మార్పు తెచ్చేందుకు అవసరమైన కౌన్సిలింగ్ ఇచ్చామని తెలిపారు. మరోసారి పట్టుబడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించినట్టు వెల్లడించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యవహారాలు తమ కంటపడినప్పుడు పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Latest News
 

కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడించిన విద్యార్థులు Sat, Oct 26, 2024, 12:40 PM
కూకట్ పల్లి మెట్రో స్టేషన్ల వద్ద యువతుల అసభ్య ప్రవర్తన..! Sat, Oct 26, 2024, 11:42 AM
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ Sat, Oct 26, 2024, 11:27 AM
అంతర్రాష్ట్ర డ్రగ్‌ పెడ్లర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 26, 2024, 11:21 AM
మహబూబాబాద్ జిల్లాలో సైకో వీరంగం Sat, Oct 26, 2024, 11:00 AM