సీఐ కుమారుడి ర్యాష్ డ్రైవింగ్.. మహిళ స్పాట్ డెడ్

byసూర్య | Fri, Dec 01, 2023, 06:59 PM

హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం జరిగింది. అప్పుడే స్కూల్‌ నుంచి బయటకు వచ్చిన బైక్ ఎక్కుతున్న ఓ మహిళను అతివేగంతో దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. క్షణాల్లో జరిగిన ఈ ప్రమాదంలో.. మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. అయితే.. అతివేగంతో దూసుకొచ్చిన కారు నడిపింది ఓ పోలీసు ఉన్నతాధికారి కుమారుడిగా తెలుస్తోంది. కాజీపేటకు చెందిన కవిత అనే మహిళ.. సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుంచి అప్పుడే బయటికు వచ్చింది. రోడ్డు పక్కనే ఉన్న తమ ద్విచక్రవాహనం ఎక్కుతున్న సమయంలో.. TS03 FA9881 నెంబర్ కారు మెరుపు వేగంతో దూసుకొచ్చి కవితను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. కవితకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే.. ఈ యాక్సిడెంట్‌ గురువారం జరగ్గా.. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఈరోజు బయటకు వచ్చాయి.


అయితే.. ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఎక్సైజ్ సీఐ కుమారునిగా గుర్తించారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయం నుంచి.. ఈ ఘటనపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా.. ఎవ్వరూ స్పందించకపోవటం గమనార్హం. నిన్నటి నుంచి పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవాట్లేదని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. పోలీస్ అధికారి కుమారున్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీస్ అధికారి కుమారుడే యాక్సిడెంట్ చేశాడని అందుకే.. పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కవిత కుటుంబ సభ్యులు , బంధువులు, స్నేహితులు కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ వెళ్లగా.. వాళ్లను బయటికి వెళ్లగొడుతున్నారని.. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని మృతురాలి బంధువులు.. ఫాతిమా నగర్ జంక్షన్‌లో ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో.. అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


Latest News
 

హైదరాబాదీలకు శుభవార్త.. ఇక ఇంటి వద్దకే ఆ సేవలు.. మంత్రి కీలక ప్రకటన Sat, Oct 26, 2024, 11:43 PM
తెలంగాణలో పత్తి రైతులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ సమస్యలకు చెక్ Sat, Oct 26, 2024, 10:15 PM
నేష‌న‌ల్ గేమ్స్‌కు తెలంగాణ ఆతిథ్యం.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు Sat, Oct 26, 2024, 10:13 PM
ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూసేలా.. నగరం మరో ఐకానిక్ నిర్మాణం: సీఎం రేవంత్ Sat, Oct 26, 2024, 09:28 PM
గ్రీజు వంటి నూనె, కుళ్లిన చికెన్.. హోటల్స్, స్వీట్ షాపుల్లో దారుణాలు Sat, Oct 26, 2024, 09:27 PM