byసూర్య | Thu, Nov 30, 2023, 03:23 PM
మెదక్ జిల్లా తూప్రాన్ 44వ హైవే పై గురువారం రోడ్డు ప్రమాదం. ఓటు వేయడానికి వస్తున్న దంపతులు తూప్రాన్ 44వ హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. టోల్గేట్ సమీపంలో బైక్ లారీ ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందగా భర్త గణేష్ కు గాయాలయ్యాయి.
మృతురాలు నిజాంపేట మండలం చదివేన గ్రామానికి చెందిన భాజా లావణ్య గా గుర్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి మేడ్చల్ నుంచి స్వగ్రామం వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.