byసూర్య | Thu, Nov 30, 2023, 03:08 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మెదక్ జిల్లా మాచవరం గ్రామంలో ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అలాగే మెదక్ పట్టణం లోని బాయ్స్ జూనియర్ కాలేజీలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎస్. మహేందర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శని ఐపీఎస్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కుకు చాలా ప్రాధాన్యం ఉన్నదని ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికల్లో పౌరులు ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు.
అలాగే పోలింగ్ కేంద్రాల ను సందర్శించి, విధి నిర్వహణలో ఉన్న అక్కడి పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ. ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర సంబంధిత అధికారుల సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుతంగా వినియోగించుకునేలా పోలీస్ సిబ్బంది వారికి భద్రత కల్పిస్తూ, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని, ఎన్నికల నిర్వహణ గురించి పలు సూచనలు చేశారు.