byసూర్య | Thu, Nov 30, 2023, 03:06 PM
మెదక్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గురువారం ఉదయం 7గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకట్టారు. మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ 50.80 శాతంగా నమోదైంది.
సాయంత్రం 5 గంటలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. అప్పటి వరకూ క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఉంటుంది. దీంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముంది.