byసూర్య | Thu, Nov 30, 2023, 03:04 PM
భద్రాద్రి జిల్లా చర్ల మండలం పెద్ద ముసలియర్ రోడ్డు మార్గం మధ్యలో ఉన్న ప్రధాన బ్రిడ్జి వద్ద గురువారం ఐఈడీని పోలీసులు గుర్తించారు. పోలీసులే టార్గెట్ గా మావోయిస్టులు మందుపాతర పెట్టినట్టు సమాచారం.
డాగ్ స్క్వాడ్ తనిఖీల్లో ఐఈడీ బయటపడిందని పోలిసులు వెల్లడించారు. ఇంకా రెండు అమర్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.