byసూర్య | Thu, Nov 30, 2023, 03:03 PM
హైదరాబాద్ జిల్లాలో గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు 20.79 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలైన్ లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశాన్ని అధికారులు కల్పించారు.
రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.