ఎన్నికల వేళ విద్యార్థులకు 2 రోజుల సెలవులు,,,ఉద్యోగులకు పెయిడ్ హాలిడే

byసూర్య | Tue, Nov 28, 2023, 06:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విద్యా సంస్థలకు అధికారులు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. బుధ, గురువారాల్లో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈమేరకు హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఉత్తర్వులు జారీ చేశారు. నగరంలోని పలు విద్యాసంస్థల్లో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఆయా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామగ్రిని తరలించన్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవు ప్రకటించారు.


మరోవైపు.. పోలింగ్ రోజున ఉద్యోగులందరికి పెయిడ్ హాలిడే ప్రకటించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. అన్ని ప్రైవేటు సంస్థలు, ఐటీ సంస్థలు, పరిశ్రమలు విధిగా సెలవు ప్రకటించి.. ఉద్యోగులంతా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సహకరించాలని సీఈవో వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలను పాటించకపోతే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. కాగా.. ఇప్పటికే కొన్ని కంపెనీలు పోలింగ్ రోజున హాలిడే ప్రకటించగా.. ఈసీ ఆదేశాలతో మిగిలిన సంస్థలు కూడా ప్రకటించనున్నాయి. ఇదిలా ఉంటే.. మూడు రోజుల పాటు వైన్స్ బంద్‌ చేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు (నవంబర్ 28) 5 గంటల నుంచి 30 తారీఖు 5 గంటల వరకు మద్యం దుకాణాలు మూసేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చట్ట రిత్యా చర్యలు తీసుకుంటామని అధికారులు ఆదేశించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM